Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీతి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కాకతీయ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని ప్రీతి మరణానికి కారణమైన దోషుల్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారంనాడామె ప్రీతి కుటుంబ సభ్యులకు లేఖ రాసారు. ఆమె మరణవార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు. ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని అన్నారు. ప్రీతి కుటుంబానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అండగా ఉంటాయనీ, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.