Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళోజీ యూనివర్సిటీకి గవర్నర్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కాళోజీ విశ్వవిద్యాలయానికి లేఖ రాసారు. యూనివర్సిటీలో విద్యార్ధులకు సంబంధించి ర్యాగింగ్, వేధింపులు జరిగినపుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే వివరాలు కూడా పంపాలని కోరారు. మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటలు, వైద్యకళాశాలలు, ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పనితీరుపైనా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రీతిని నిమ్స్‌కు అత్యంత కీలకమైన సమయంలో తరలించారనీ, ఆమెకు వరంగల్ ఎంజీఎంలోనే సకాలంలో సరైన వైద్యం, దానికి అవసరమైన వైద్య నిపుణులు, అత్యాధునిక పరికరాలను తరలించి ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది.