Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-పరకాల
సమాజ సేవలో రౌతు మనోహర్ సేవలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం పరకాలలో రౌతు మనోహర్ స్థూపం ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్మరణ సభలో తమ్మినేని మాట్లాడు తూ.. రౌతు మనోహర్ సీపీఐ(ఎం) కార్యకర్తగా ప్రస్థానం మొదలై రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు చేపట్టి ఎందరికో అత్యున్నతమైన సేవలు అందిం చారని కొనియాడారు.
అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులు సైతం సమాజ సేవలో పాల్గొనడం అభినందనీయమన్నారు. నేడు ఒంటిపై దుస్తులు మార్చుకున్నంత ఈజీగా పార్టీలు మారడం అలవాటైపోయిందని, దాన్ని ఎన్నడూ ప్రజలు క్షమించరని పాలకులు గుర్తించుకోవాలన్నారు.జిల్లా కార్య దర్శి బొట్ల చక్రపాణి రౌతు మనోహర్ సేవల గురించి వివరించి, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుల్లా అశోక్, మున్సిపల్ చైర్పర్సన్ షోద అనిత రామకృష్ణ, వైస్ చైర్మెన్ రేగురి జైపాల్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మడికొండ శీను, సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.