Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటకులకు ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రకృతి అందాల సుందర ప్రాంతం కేరళలో ఆతిథ్యం స్వీకరించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తమ రాష్ట్రానికి రావాలని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసింది. కేరళలోని అకుపచ్చని అందాలు, సెలయేర్లు, సుందర సుమనోహర ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన వసతి, బోటింగ్, హిల్ స్టేషన్లు సహా భూతల స్వర్గం ఇక్కడ నెలవైఉందని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయనీ, యువతీ యువకులు తమ జ్ఞాపకాలను తమ రాష్రంతో పంచుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆహ్వానిస్తున్నారు. సముద్రం, ఆకాశాన్నంటే కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్ అలలు, సహజమైన స్వచ్ఛమైన గాలి, విశాలమైన తేయాకు తోటలు, ఆధ్యాత్మిక శోభకూ నెలవైన కేరళలో పర్యాటకరంగ అభివృద్ధిని తాము కాంక్షిస్తున్నామని తెలిపారు. మంగళవారంనాడిక్కడి ఓ హౌటల్లో కేరళ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ టు బిజినెస్ (బీ టూ బీ) కార్యక్రమం జరిగింది. ఆ రాష్ట్ర సమాచారశాఖ విభాగాధిపతి సజేష్ కేరళ విశిష్టత, విహార స్థలాలు, ఆధ్యాత్మిక, ఆరోగ్య కేంద్రాల గురించి వివరించారు. ప్రకృతి ప్రేమికులకు తమ రాష్ట్రం సాదరంగా ఆహ్వానిస్తుందని అన్నారు. అనేక రికార్డులు కేరళ సొంతమనీ, అక్కడి గ్రామీణ సౌందర్యం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను తాము ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కోవిడ్ తర్వాత కేరళకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పర్యాటకులు కోరుకున్నట్టు వసతి, రవాణా, భోజనం సహా అన్ని సౌకర్యాలతో రకరకాల పర్యాటక ప్యాకేజీలను అందిస్తున్నామన్నారు. ఏటా దేశవ్యాప్తంగా ఈ తరహా బీ టూ బీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ, త్వరలో బెంగుళూరులో కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కేరళ రాష్ట్రం గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ కేంద్రంగా, నూతన జంటల హనీమూన్‌ను అనువైన ప్రాంతంగా ఉంటుందని చెప్పారు. అంతకుముందు ప్రదర్శించిన కేరళ సంప్రదాయ నృత్యాలు, యుద్ధ కళలు ఆహూతులను ఆకర్షించాయి.