Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ధరలకనుగుణంగా స్కాలర్షిప్ పెంచాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయి వెంటనే విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్స్ చారిరీలను రూ.1500 నుంచి రూ. 3 వేలకు పెంచాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3,500 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ పెండింగ్‌లో ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
వారి విద్యాసంవత్సరం పూర్తై చాలాకాలం అవుతున్నా రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. విద్యార్థులు కళాశాలల్లో సర్టిఫికెట్లు అడిగితే ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని, ఫీజు మొత్తాన్ని చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుపోవాలని యాజమాన్యాలు చెబుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల డబ్బుల్లేక తమ సర్టిఫికెట్లను తీసుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లెనిన్ గువేరా, అశోక్ రెడ్డి, నాగేందర్ వీరేందర్, కార్యకర్తలు కవిత, సంధ్య, శివ, వేణు, వసు, అజరు తదితరులు ఉన్నారు.