Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కేటీపీపీ ఉద్యోగులు వేతన సవరణ-2022 కోసం చేస్తున్న ఆందోళన మంగళవారమూ కొనసాగింది. వారి నిరసన ఐదో రోజుకు చేరుకుంది. కేటీపీపీ ఉద్యోగులు, కార్మికులు, ఇంజినీర్లు, ఆర్టీజన్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీపీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగులకు వేతన సవరణ-2022 వెంటనే అమలు చేయాలని, లేదంటే వేతన సవరణ, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ పవర్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తన ఆందోళన చేస్తామని హెచ్చరించారు.