Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 53 ఏండ్ల తర్వాత కలయిక
- సంతోషం వ్యక్తం చేసిన గుత్తా
నవతెలంగాణ -చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1969-70లో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు మంగళవారం ఉరుమడ్ల గ్రామంలోని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వగృహంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి తన మిత్రులతో కలిసి సందడి చేశారు. మిత్రులతో కలిసి విద్యార్థి దశ అనుభవాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విద్యను నేర్పించిన గురువులను ఘనంగా సన్మానించారు. అలాగే, తమ బ్యాచ్‌కు చెందిన ముగ్గురు మిత్రులు మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులకు రూ.25 వేల చొప్పున సహాయం అందజేశారు. శాసన మండలి చైర్మెన్ హోదాలో బిజీగా ఉన్నా తమలో ఒకరిగా కలిసిపోయి పేరుపేరునా అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి సహచరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రధానోపాధ్యాయులు ఎ.అంజిరెడ్డి, ఉపాధ్యాయులు జయారపు కృష్ణయ్య, అంజయ్య, పూర్వ విద్యార్థులు శీలా రాజయ్య, వెలుపెల్లి శంకరయ్య, నాంపెల్లి జనార్ధన్, పంతంగి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.