Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాకు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ పోలీసులతో గొడవ
- ఎస్ఐపై దాడి
నవతెలంగాణ- బంజారా హిల్స్
బంజారాహిల్స్లో ఓ వ్యక్తి ఫుల్గా మందు తాగి వాహనం నడుపుతూ వీరంగం సృష్టిం చారు. తనకు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ పోలీసులతో గొడవ పడి ఎస్ఐపై దాడి చేశాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ బంజా రాహిల్స్లో సోమవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ యువకుడిని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 94 బీఏసీ పాయింట్లు వచ్చాయి. దాంతో ఆ యువకుడు రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ ఎస్ఐపై దుర్భాషలాడుతూ.. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ బెదిరించాడు. అనంతరం ఎస్ఐని కాలితో తన్నాడు. దాంతో ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. యువకుడి కారులో ఒక మహిళ కూడా ఉన్నారు.