Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దిమడుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆదిత్య
- ఒక్క రోజే 15 అగ్ని ప్రమాదాలు
నవతెలంగాణ - అచ్చంపేట రూరల్
నల్లమల అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని మద్ది మడుగు, దోమలపెంట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆదిత్య తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ డివిజన్ పరిధిలో మంగళవారం ఒక్కరోజే సుమారు 15 అగ్ని ప్రమాదాలు సంభవించాయని తెలిపారు. అక్క మహాదేవి బిలమ్, వటవర్లపల్లి బీట్ పరిది, ఈగల పెంట సెక్షన్ మరియు న్యూ రోడ్ ఫర్హాబాద్ సౌత్ బీట్ , తుర్కపల్లి సెక్షన్ అమ్రాబాద్ రేంజ్లో, బోరెటి బావి మన్ననూర్ రేంజ్ పరిధిలో మంటలు చెలరేగడంతో గుర్తించారు. అటవీ సిబ్బంది, 70 మంది ఫారెస్ట్ ఫైర్ వాచర్స్, ఫైర్ టీమ్స్ క్విక్ రెస్పాన్స్ టీములు సకాలంలో అక్కడికి చేరుకొని ఉదయం నుంచి ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు.