Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హుజూర్నగర్ రూరల్
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం శ్రీనివాసాపురంలో ఆదివారం రాత్రి గుండెపోటుతో సీపీఐ(ఎం) మండల నాయకులు, నవతెలంగాణ స్టేట్ బ్యూరో ఇన్చార్జి బీవీఎన్ పద్మరాజు తండ్రి బొల్లేపల్లి వెంకటరాజు మృతిచెందిన విషయం విదితమే. కాగా, మంగళవారం వెంకటరాజు కుటుంబాన్ని నవతెలంగాణ దినపత్రిక సంపాదకులు ఆర్.సుధాభాస్కర్ పరామర్శించారు. వెంకటరాజు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మరాజును, ఆయన తల్లి అనసూర్యమ్మను, తమ్ముడు సీతరామరాజు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. పద్మరాజు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నివాళులర్పించిన వారిలో నవతెలంగాణ న్యూస్ ఎడిటర్ రాంపల్లి రమేశ్, బుకహేౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి, బోర్డు సభ్యులు అనంతోజు మోహన్‌కృష్ణ, మాజీ సర్పంచ్ తంగేళ్ల వెంకటచంద్ర, గోపరాజు, పారుపల్లి శ్రీనివాస్‌రావు (శ్రీశ్రీ) కృష్ణమూర్తి, పారుపల్లి శ్రీను తదితరులు ఉన్నారు.