Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు బ్లాక్‌లను బంధువులకు కట్టబెట్టుకున్నారు : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ- కోల్ బెల్ట్
''బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు.. కాంగ్రెస్‌కు అధికారం కొత్తేమీ కాదు.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా మరొక్కసారి ప్రజలు అధికారం ఇస్తే అసలైన తెలంగాణ ఏంటో చూపిస్తాం..'' అని టీపీసీసీ అధ్యక్షులు ఎనమల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి ఏరియా కేటికె-5 గనిలో ఐఎన్టీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య అధ్యక్షతన గేట్మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు పాల్గొని సకలజనుల సమ్మె చేస్తేనే రాష్ట్రం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సమ్మెను చూసి స్పందించి ఢిల్లీ పార్లమెంట్లో రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టారని చెప్పారు. తద్వారా ఆంద్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిం దని, కేంద్రంలో అధికారం కోల్పోయిందని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ పాలైందని అన్నారు. 9 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబం ప్రజలను దోచుకుంటూ కోట్లు కొల్లగొడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి.. టీబీజీకేఎస్ సంఘానికి గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ సంఘానికి గౌరవ అధ్యక్షుడు హరీశ్‌రావు అయి ఉండి కూడా కార్మిక సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదో కార్మికులు ఆలోచించాలన్నారు. ప్రజలు, కార్మికులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. సమస్యలు చెబితే సరిపోదని, పెన్ను, పేపరు, అధికారం ఇస్తే.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బతికించుకుం దామని చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేను, మంత్రిని, సీఎంని కలిసే పరిస్థితులు లేవని, కాంగ్రెస్ హయాంలో సామాన్య పౌరుడు ఎవరిని కలవాలన్నా సులభతరంగా ఉండేదని వివరించారు. మోడీ, కేసీఆర్ ఒకే తల, రెండు దేహాలు కలిగి ఉన్నారని, పైపైకి మాత్రమే ప్రయివేటీకరణ, రైతు చట్టాలు తదితర అంశాలపై పోరాడినట్టు కేసీఆర్ నటిస్తున్నారని విమర్శించారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకం అంటూనే.. తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను తన బంధువు ప్రతిమ శ్రీనివాస్‌కు, కోయగూడెం ఓసీ అరబిందో ఫార్మాకు కట్టబెట్టిండని.. దాంట్లో వారి వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు.
మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ అనేక రాష్ట్రాలలో కార్మికుల సమస్యలను విని ఐఎన్టీయూసీ దృష్టికి తెచ్చార న్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే కార్మిక శ్రేయస్సుకు కట్టుబడి పని చేస్తామని, గతంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు ఇన్‌కం టాక్స్ రద్దు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. కార్మికుల కష్టంతో లాభాలు వస్తే నిధులు తీసుకెళ్లి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, పాలకుర్తిలో ఎందుకు ఖర్చు పెడుతున్నారని నిలదీశారు.
భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. లాభా లలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయి వేటుపరం అదానీ, అంబానీలకు దోచిపెట్టడమే పర మావధిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తు న్నాయని ఆరోపించారు. ఈ ప్రభుత్వాలతో ప్రజలు విసుగెత్తారని, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలు పొందడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి అయిత ప్రకాష్‌రెడ్డి, నాయకులు మధుకర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, పొనగంటి కృష్ణ, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.