Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొట్టుకున్న నాయకులు
- పోలీసుల లాఠీచార్జి
- టవరెక్కి నిరసన తెలిపిన కాంగ్రెస్ యువజన నాయకుడు సాగర్
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీ, కటౌట్లు ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కొట్టుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నాలుగు రోజుల కింద భూపాలపల్లికి కేటీఆర్ వస్తే బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు కట్టారు. ఇప్పుడు అదే స్థలంలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం, తోపులాట జరిగింది. ఆ తర్వాత నినాదాలు చేసుకుంటూ కొట్టుకున్నారు.
దీంతో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. సీఐ రాజిరెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు గ్రూపులను చెదర గొట్టారు. ఎలక్ట్రా నిక్ మీడియా కెమెరా మెన్‌తో పాటు పలువురికి గాయాల య్యాయి. సుమారు మూడు గంటల పాటు అంబే ద్కర్ సెంటర్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఫ్లెక్సీకి అడ్డుగా రేవంత్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయకూడదని పట్టుబట్టారు. కేటీఆర్ పర్యటన ముగిసి ఆరు రోజులైనా ఫ్లెక్సీలు ఎందుకు తొలగించ లేదని, తాము ఇక్కడ రేవంత్ ఫ్లెక్సీలు పెట్టు కుంటామని కాంగ్రెస్ నాయకులు జాతీయ రహ దారిపై నిరసన వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరు కున్న డీఎస్పీ ఏ.రాములు ఇరు పార్టీల నేతలతో మాట్లాడి సము దాయించారు. దాంతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రేవంత్ కటౌట్‌ను కొంచెం ముందుకు జరిపి పెట్టారు.
కాగా, భూపాలపల్లిలో రేవంత్ బహిరంగసభ వేదిక వద్ద కూడా ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలు దూసుకొచ్చేం దుకు యత్నిం చారు. సభ వైదిక వైపు రాళ్లు, కోడి గుడ్లు విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సమీపంలోని ఉన్న థియేటర్లో బంధించారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తల కూడా బీఆర్ఎస్ శ్రేణులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి ప్రసంగం ముగించి వెళ్లిపోయారు.
సెల్ టవర్ ఎక్కి నిరసన..
బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువజన నాయకుడు ఎస్పీకే సాగర్ పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేశారు. సీఐ రాజిరెడ్డి ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, వెంటనే దిగిరావాలని కోరడంతో కిందికి వచ్చాడు.