Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లానెట్ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్‌కుమార్
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి వారి ఆధ్వర్యంలో సైన్స్ డే
నవతెలంగాణ-మియాపూర్
విద్యార్థులు శాస్త్రీయ కృక్పథం కలిగి ఉండాలని ప్లానెట్ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్‌కుమార్ సూచించారు. సైన్స్ డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా గచ్చి బౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో మంగళవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ అంతరిక్ష పరిశో ధన సంస్థ ఇస్రో ప్రసిద్ధి చెందిన సంస్థ అన్నా రు. దేశాభివృద్ధే లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞా నాన్ని అభివృద్ధి చేసిందన్నారు. ఉప గ్రహ త యారీ విధానం, భూమి నుంచి చంద్రుని పైకి వెళ్లే పద్ధతి, మార్చి 2న గురు-శుక్ర గ్రహాలు ఒకే లైన్లోకి రావడం లాంటి మరె న్నో విషయాలను విద్యార్థులకు తేలికగా అర్థ మయ్యేలా వివరించారు. ఈసారి శాటిలైట్ లాంచింగ్ జరిగే సమ యంలో వచ్చి సెలెక్ట్ చేసిన కొంత మంది విద్యార్థులకు ప్రాక్టిక ల్గా వివరిస్తామని చెప్పారు. భారతదేశ శా స్త్రీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత సివి రామన్ అని, ఆయన 'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటా మని తెలిపారు. వివిధ పాఠ శాల విద్యార్థులు వారు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందిం చారు. శాస్త్రియ దృక్పథాన్ని అలవార్చుకోవా లని బి.స్టూడియో సారథ్యంలో 'అడ్వెంచర్ ఆఫ్ చిన్నారి' నాటికను ప్రదర్శించారు. రఘు నందన్‌కుమార్ విద్యార్థులతో కలిసి లైబ్రరీని సందర్శించారు. భవిష్యత్‌లో లైబ్రరీని ఉప యోగించుకుంటామని తెలిపారు. వివిధ పాఠశాలల నుంచి 250మంది విద్యార్థులు హాజర య్యారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే ట్రస్ట్ సభ్యులు ఆర్.సాంబశివరావు, ఎన్.శ్రీనివాస రావు, సి.విజయ్‌కుమార్, పి.రవీందర్, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.