Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్ధులు డైట్ ఛార్జీలను 25శాతం పెంచాలని మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. మంత్రుల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. దీనిపై సిఎం త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. బుధవారం హైదరాబాద్లో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, గంగు ల కమలాకర్లు సిఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై డైట్ ఛార్జీల పెంపుపై చర్చించారు.పలు రాష్ట్రాల్లో పరిస్థితులను సిఎస్ మంత్రులకు వివరించారు. 3 నుంచి ఏడో తరగతి వరకు ప్రస్తుతం రూ.950 ఉండగా దాన్ని రూ.1200కు, 8 నుంచి పదో తరగతి వరకు రూ.1100 ఉండగా..దాన్ని రూ.1,400కు, ఇంటర్,పిజి విద్యార్థులకు రూ.1500 ఉండగా దాన్ని రూ.1,875లకు పెంచాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై రూ.3302కోట్ల అదనపు భారం పడనుంది.