Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హకీంపేటలో టీఎస్ఆర్టీసీ ఆతిథ్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అఖిల భారత ప్రజా రవాణా సంస్థల కబడ్డీ టోర్నమెంట్-2023 హకీంపేటలోని టీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అకాడమీలో గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ కబడ్డీ టోర్నమెంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బహణ్ ముంబై, పుణే మహానగర్ పరివాహన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొంటున్నాయని వివరించారు. కబడ్డీ ట్రోఫీ కోసం మొత్తంగా 9 జట్లు తలపడనున్నాయని పేర్కొన్నారు. ఈ పోటీలను గురువారం ఉదయం 9.30 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారక తిరుమలరావు ప్రారంభిస్తారు.