Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ జనరల్ సెక్రెటరీగా హిమాన్షు తివారీ
- మహారాష్ట్ర డివిజన్ కో ఆర్డినేటర్ల నియామకం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ సభ బహిరంగ నిర్వహించిన ఆయన...ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర అధ్యక్షుడిని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ జనరల్ సెక్రటరీగా హిమాన్షు తివారీని నియమించారు. బుధవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ మహారాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్లను ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో పార్టీ నేతలను నియమిస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్‌ను నియమించిన పార్టీ అధినేత...తాజాగా ఆ రాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్లను నియమించారు. నాసిక్ డివిజన్‌కు దశరథ సావంత్, పుణె డివిజన్‌కు బాలసాహెబ్ జైరాం దేశ్‌ముఖ్, ముంబై డివిజన్‌కు విజరుతనాజీ మోహితే, ఔరంగాబాద్ డివిజన్‌కు సోమ్‌నాథ్ థోరట్, నాగ్‌పూర్ డివిజన్‌కు ద్యానేష్ వాకుడ్కర్, అమరావతి డివిజన్‌కు నిఖిల్ దేశ్‌ముఖ్‌ను కోఆర్డినేటర్లుగా నియమించారు.