Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర రుణ ఉపశమన కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వ్యవసాయంలో వచ్చిన నష్టాలతో అప్పులు తీర్చలేక క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దనీ, తమను సంప్రదిస్తే, పరిష్కారమార్గాలు చూపుతామని తెలంగాణ రాష్ట్ర రుణ ఉపశమన కమీషన్ చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో వ్యవసాయం వృద్ధి చెందిదనీ, రైతుల కోసం అనేక పథకాలు ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ అవసరాల కోసం ప్రయివేటు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని, నష్టాలపాలై, అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్న ఐదు ఎకరాల లోపు రైతులు, గ్రామీణ చేతివృత్తిదారులు హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. బుధవారం తమ కార్యాలయంలో రుణ బాధిత రైతుల దరఖాస్తుల్ని పరిశీలించి, కోర్టు హాలులో పరిష్కరించినట్టు చెప్పారు. ఇతర వివరాలకు తమ కార్యాలయం నెంబర్ 040-2339 3532 ఫోన్ చేయాలని కోరారు.