Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు ఏఐడీఎస్వో,పీఎస్ఎస్సీ వినతి
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను కాపాడాలని ఏఐడీఎస్వో, పీఎస్ఎస్సీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని బుధవారం ఆయా సంఘాల నాయకులు జె మల్లేష్రాజ్, నితీష్, నాగరాజ్, అభిషేక్, నేహా కలిసి వినతిపత్రం సమర్పించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్ విద్యను షిఫ్ట్ పద్ధతిలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యలో విద్యా ప్రమాణాలను దిగజార్చే విధంగా ఓపెన్ బుక్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యావిధానం-2020లో భాగంగా పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ ఉనికికే ప్రశ్నార్థకంగా తయారు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.