Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల పాలిట గుదిబండగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే గ్యాస్ ధర పెరిగిందని ఆందోళన చెందుతున్న ప్రజలపై మరోసారి రూ.50 భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ఒకరిద్దర్ని పోషిస్తున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 2న నియోజవర్గం, 3న మండల కేంద్రాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.