Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బిజినెస్ అడ్వజైజరీ కమిటీ(బీఏసీ) నుంచి బీఆర్ఎస్ను తొలగిస్తూ లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వానికి పంపిన ఆహ్వానమే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావు బీఏసీ సమావేశాలకు సభ్యుడిగా హాజరవుతున్నారు. కాగా తాజాగా ఆయనకు పంపిన ఆహ్వానంలో ఆహ్వానితుడిగా మాత్రమే పేర్కొన్నారు. సాధారణంగా లోక్సభ నియామవళి ప్రకారం ఆసభలో కనీసం ఆరుగురు ఎంపీలను కలిగి ఉంటే ఏపార్టీకైనా లోక్సభ బీఏసీలో ప్రాతినిథ్యం కల్పిస్తారు. కాగా లోక్సభలో బీఆర్ఎస్కు తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. అయినా లోక్సభ బీఏసీ నుంచి బీఆర్ఎస్ను తొలగించడం చర్చనీయాంశమైంది. ఇకపై ఆహ్వానం పంపితేనే భేటికి హాజరుకావాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కు ఎదురైంది. కాగా లోక్సభ సచివాలయం టీఆర్ఎస్గానే పరిగణిస్తున్నది. బీఆర్ఎస్గా మారినా పట్టించుకోకపోవడం గమనార్హం.