Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి : ఎమ్మెల్సీ కవిత డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీ ఢిల్లీలో నిరాహార దీక్ష చేపడుతున్నట్టు భారత జాగతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. గురువారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రెండుసార్లు హామీ ఇచ్చిందనీ, అమల్లోకి మాత్రం తేవట్లేదని అన్నారు. ఇందుకు నిరసనగా భారత జాగతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్ష చేపట్టాలనుకున్నామనీ, అయితే ఆ రోజు హౌలీ పండుగ ఉన్నందున 10వ తేదీన దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. ఈ దీక్షకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామన్నారు. 13 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమ వుతున్న నేపథ్యంలో ఈ సెషన్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టరూపం కల్పిస్తామని చెప్పి అధికా రంలోకి వచ్చిందని తెలిపారు. తొమ్మి దేండ్లయినా దీనికి చట్టబద్ధత ఎందు కు కల్పించలేదని ప్రశ్నించారు. మద్య ం కుంభకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్టు తర్వాత కవితను అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు చెప్తున్నారనీ, దీనిపై స్పందిం చాలని విలేకరులు కోరారు. ఆ విష యాలు కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాలనీ డిమాండ్ చేశారు.