Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం
- ఓటేసిన గెలిపించిన కార్మికులందరికీ ధన్యవాదాలు : చుక్క రాములు
నవతెలంగాణ-గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని ఆర్బీఎల్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. 31 ఓట్ల మెజార్టీతో సీఐటీయూ ఘనవిజయం సాధించింది. గురువారం రాణే బ్రేక్ లైనింగ్ పరిశ్రమ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి రవీందర్రెడ్డి సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 160 ఓట్లు ఉండగా.. 160 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సీఐటీయూకు 95 ఓట్లు, బీఎంఎస్కు 64 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లలేదు. 31 ఓట్ల మెజార్టీతో సీఐటీయూ విజయం సాధించింది. అనంతరం రాణే బ్రేక్ లైనింగ్ పరిశ్రమ నుంచి గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఉపాధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఇది కార్మికుల విజయమన్నారు. వరుసగా సీఐటీయూపై నమ్మకంతో మూడుసార్లు గెలిపించిన కార్మికవర్గానికి విప్లవ జేజేలు తెలిపారు. కార్మికులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మంచి వేతన ఒప్పందం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందబోయిన ఎల్లయ్య, కాముని గోపాలస్వామి, ఉపాధ్యక్షులు బండ్ల స్వామి, యూనియన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ భిక్షపతి, చంద్రశేఖర్రెడ్డి, వెంకట్రావు, రంగారెడ్డి, మల్లయ్య, నర్సింలు, శివయ్య, రవికుమార్, కుత్బుద్దీన్, సాజిద్, రమేష్, పోశయ్య తదితరులు పాల్గొన్నారు.