Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులిస్తేనే పనులు: కాంట్రాక్టర్లు
- ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి
- ఎన్నికల వేళ ఆందోళన
- ఖర్చులకు కాసులు కావాలంటూ గుసగుస
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల బిల్లులు భారీగా పేరుకుపోయాయి. వర్కింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు పనులు చేస్తూ, బిల్లులు సమర్పించినా నిధులు విడుదల కావడం లేదు. ఈనేపథ్యంలో ప్రాజెక్టుల పనులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. పైసలిస్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు మొండికేస్తుండగా, ఇంజినీరింగ్ శాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక చిన్నా, చితక కాంట్రాక్టర్ల తిప్పలు చెప్పనలవి కావు. రాష్ట్రంలో 26 భారీ, 13 మధ్య తరహా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి రూ.8000 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు వాటా రూ.3000 కోట్లు కాగా, తర్వాతి స్థానంలో రూ.2,300 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.300 కోట్ల దాకా బిల్లులు ఇవ్వాల్సి ఉంది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకుగాను రూ.759.42 కోట్లు, శ్రీపాదసాగర్ ఎత్తిపోతల పనుల కింద రూ.437 కోట్లు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.142.55 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత పెంచిన నేప థ్యంలో బిల్లుల చెల్లింపులు ఆలస్య మవుతున్నాయనే ప్రచారం అధికారవర్గాల్లో జరుగు తున్నది.
ఇవ్వాల్సిందే
ఏ పనులు చేపట్టా లన్నా ఇప్పటి వరకు చేసిన పనుల బిల్లులు ఇవ్వాల్సిం దేనని వర్కింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇక కాంట్రాక్టర్లలో అధిక శాతం ప్రజాప్రతినిధులే ఉండటం గమన ార్హం. ఇందులో మాజీలు సైతం ఉన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఖాతాలో 103 మంది దాకా శాసన సభ్యులు ఉండగా.. వారిలో 40 మంది దాకా కాంట్రాక్టర్లే. వీరిలో కొందరు నేరుగా ప్యాకే జీలు దక్కిం చుకోగా, మరికొందరు సబ్ కాంట్రా క్ట్‌లు తీసుకుని పనులు చేస్తు న్నారు. బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగు తుండటంతో కొందరు ప్రజాప్రతినిధులు అసం తృప్తిగా ఉన్నట్టు సమా చారం. సొంత నియోజక వర్గాల్లో పనులు చేసినట్టు ఉంటుంది, కొంత సంపాదించుకున్నట్టు ఉంటుందనే కారణంతో కాంట్రాక్టులు తీసుకుని పనులు చేశారు. బిల్లులు రాకపోవడంతో ఉస్సూరమంటున్నారు. దాదాపు రెండు, మూడేండ్లుగా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో వడ్డీలు సైతం అదనపు భారంగా మారుతున్నాయని చెబుతున్నవారూ ఉన్నారు.
నివేదిక పంపినా...
ఇటీవల ప్రాజెక్టుల పురోగతిపై నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్షలు చేయగా, బిల్లులు ఇవ్వకుండా పనులు చేయించలేమని అధికారులు స్పష్టం చేశారు. దాంతో ఏకకాలంలో పెద్ద మొత్తంలో కాకుండా ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేసేలా ప్రభుత్వాన్ని కోరాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. నిధుల విడుదలకు సంబంధించి ఓ జాబితాను సర్కారుకు సమర్పించారు. అయితే ఆ సమావేశంలో నిర్ణ యాలు తీసుకుని ఆర్థిక శాఖకు నివేదిక పంపినా, కాసులు రాకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదనే చర్చ అధికారుల్లోనూ జరుగుతుండటం అందరికీ తెలిసిందే.
కేటాయింపులే
తాజా బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించింది రూ. 26 వేల కోట్లు మాత్రమే. ఇందులోనూ నిర్మాణాల కోసం రూ. 7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నారు. మిగతా సొమ్ము ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్టు సమాచారం. ఇదిలావుండగా నిటి అయోగ్ చెప్పినా కేంద్రం మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వలేదు. అలాగే ఏఐబీపీ నుంచి సాధారణంగా వచ్చే నిధులనూ తగ్గించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా, పట్టించుకోలేదు. సరికదా పక్కనే ఉన్న కర్నాటకలోని భద్ర ప్రాజెక్టుకు రూ.5000 కోట్లు కేంద్రబడ్జెట్లో కేటాయించింది. ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యమే బకాయిలు మిగలడానికి కారణమని సాగునీటిరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. అంచనాలు అతిగావేయడం, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం మూలానా బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయనీ, దీంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పేర ఆంక్షలు విధించడం, బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుత పరిస్థితికి కారణమని వివరించారు. సాగునీటి శాఖ పెండింగ్ బిల్లులపై ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా, అందుబాటులో లేరు.