Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఆందోళన
- పాల్గొన్న వామపక్షాలు, బీఆర్ఎస్ నేతలు
- ప్రజల సొమ్మునంతా గుజరాతీలకు దోచి పెడుతున్న మోడీ : మంత్రి జగదీశ్
నవతెలంగాణ- విలేకరులు
వంట గ్యాస్ ధర పెంపుపై నిరసన పెల్లు బుకింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వామపక్షాలు, ప్రజాసంఘాలు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు.
సూర్యాపేట జిల్లా మునగాలలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట మండలంలోని రాయినిగూడెంలో ఐద్వా ఆధ్వర్యంలో, భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వలిగొండలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆలేరు మండలం, బీబీనగర్, మోత్కూరు, యాదగిరిగుట్ట తదితర మండలాల్లో రోడ్డుపై గ్యాస్ సిలిండర్లు పెట్టి నిరసన తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా, ఖమ్మంరూరల్ మండలాల్లో గ్యాస్ ధరలపై నిరసన తెలిపారు. ఖమ్మం
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పెద్ద గడియారం చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోడీ మోసం బట్టబయలైందన్నారు. యావత్ భారతదేశంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మునంతా గుజరాతీలకు దోచిపెట్టారని విమర్శించారు. ఇప్పటివరకు 19 లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీ, అంబానీలకు దోచిపెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. అందులో మెజారిటీ మొత్తం తెలంగాణా ప్రజల సొమ్మేనని తెలిపారు. ఉజ్వల స్కీం లో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా లబ్ది పొందిన మొదటి మహిళ సైతం సిలిండర్‌ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారని చెప్పారు. మర్రిగూడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దేవరకొండలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కట్టెల పొయ్యి పెట్టి, వంట చేశారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్లో మహాధర్నాలో గ్యాస్ సిలిండర్లు, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ నల్ల దుస్తులు ధరించి గ్యాస్ సిలిండర్ మోసుకుంటూ వచ్చారు. అనంతరం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య, నందిత, నివదిత అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళలతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. మల్కాజిగిరి చౌరస్తాలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మెన్ పెంట రాజయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌక్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్ రోడ్డుపైనే వంటావార్పు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్లపైన గ్యాస్ సిలిండర్లు పెట్టి ఆందోళనలు చేశారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అలాగే నార్సింగి ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళలతో కలిసి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ చైర్మెన్ శాంత కుమారి ధర్నా నిర్వహించి వంటావార్పు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్వర్యంలో నిరసన తెలిపారు. వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు.