Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభోత్సవంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అగ్రి ఎక్స్పో నిర్వహించడం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరగనున్న అగ్రి ఎక్స్పో మంత్రి ప్రారంభించారు. దేశ నలుమూలలకు చెందిన 150కి పైగా ఎగ్జిబిటర్లు, 30 వేల మంది సందర్శకులు హాజరవుతారని తెలిపారు. అగ్రి స్టార్టప్స్ కోసం ప్రత్యేక విభాగమైన స్పార్క్బీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీల క్లస్టర్ జ్ఞాన కేంద్రం, గణనీయ సంఖ్యలో పాల్గొన్న పలు ప్రధాన పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇంత భారీస్థాయిలో అగ్రి ఎక్స్పో జరగడం ఇదే మొదటిసారి అన్నారు. వ్యవసాయంలో వివిధ రకాల యంత్రాలు, వినూత్న ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ ప్రదర్శన వినూత్న ఆవిష్కర్తలకు మాత్రమే కాకుండా రైతులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. కిసాన్ ఫోరమ్ కన్వీనర్ నిరంజన్ దేశ్‌పాండే, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలకు సంబంధించిన పలు వురు అతిథులు హాజరయ్యారు.