Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
2003 డిసెంబర్ 22కు ముందు నోటిఫికేన్ ఇచ్చి 2004 జనవరి ఒకటి తర్వాత నియామకాలు జరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాతపెన్షన్ వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రంలోనూ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్ యూటీఎప్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2003 డియస్సీ నోటిఫికేషన్ 2003 నవంబర్లో ఇచ్చారని తెలిపారు. 2004 జులై నాటికి ఫలితాలు వెలువడ్డాయనీ, నియామక ఉత్తర్వులు మాత్రం 2005లో ఇచ్చారని చెప్పారు. అలాంటి ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల మంది, ఇతర శాఖల్లో మరో ఆరు వేల మంది ఉంటారు. వీరందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.