Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఎండ్ టూ ఎండ్ సేవలను అందించడానికి వీలుగా హైదరాబాద్‌లో యూనిస్కాలర్స్ కార్యాలయాన్ని ఓపెన్ చేసింది. శుక్రవారం రాజ్‌భవన్ రోడ్డులో ఈ కార్యాలయాన్ని ఐఆర్ఎస్ఈ డైరెక్టర్ డాక్టర్ సతీశ్‌కుమార్‌తో కలిసి టీఎస్ఆర్టీసీ చైర్మెన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో విద్యనభ్యసించే వారికి మెరుగైన సేవలను అందించాలని ఆకాంక్షించారు. యూనిస్కాలర్స్ వ్యవస్థాపకులు అమిత్‌సింగ్ మాట్లాడుతూ...ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలలో తర్వాత హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించడం సంతోషకరంగా ఉందని చెప్పారు. విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల సంఖ్య హైదరాబాద్‌లో 135 శాతం పెరిగిందని తెలిపారు. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. స్టడీలోన్స్, ఆయా విశ్వవిద్యాల యాల్లో కోర్సుల బోధనను పోల్చడం, కెరీర్, కోర్సు మ్యాపింగ్, ఎస్ఓపీ, ప్రాపర్టీ గైడ్‌లైన్స్, తదితర అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు తమ సంస్థలో వంద మందికిపైగా కౌన్సిలర్లు ఉన్నారని వివరించారు.