Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10,11 తేదీల్లో మండల కేంద్రాల్లో, 14,15 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని ప్రజాసంఘాలు నిర్ణయించాయి. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు ఆశాలత మాట్లాడారు. ఆ సభలు, సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు.