Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వినికిడి లోపమున్న పేదల కోసం ఆ పరికరాలపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని మినహాయించాలని గౌర గ్రూప్ చైర్మెన్ శ్రీనివాస్ గౌర కోరారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మీనాక్షి వెంకటరామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పుట్టుకతోనే వినికిడి లోపంతోనే జన్మించిన పలువురికి ఉచితంగా వినికిడి పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరికరాలు ఇప్పటికే ఖరీదు ఎక్కువ కాగా, వాటిపై ఎక్సైజ్ డ్యూటీ వేస్తే మరింత భారంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి ధరలు తగ్గే విధంగా సంబంధిత రంగ నిపుణులు ప్రభుత్వాన్ని సిఫారసు చేయలని కోరారు. మీనాక్షి వెంకటరామన్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జీ.వీ.సేతురామన్ మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2013 అక్టోబర్ నుంచి 1.38 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్టు తెలిపారు. 400 మంది ఇంటర్నీలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శోభన్ బాబు, మెంటార్ రత్న బి.శెట్టి, మీనాక్షి వెంకటరామన్ ఫౌండేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ రంగనాధన్ తదితరులు పాల్గొన్నారు.