Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతి కేసులో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఇంటర్ విద్యార్థి సాత్విక్ శ్రీ ఛైతన్య కాలేజీలో ఒత్తిడికి గురై క్లాస్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, అచార్య, నరేష్, శోభన్‌ను అరెస్టు చేశారు. వీరిపై 305 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వీరిని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టుకు తరలించారు. కోర్టు సమయం అయిపోవడంతో అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకుముందు నలుగురికి నార్సింగిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జడ్జి ఎదుట నిందితులను హాజరు పరిచారు. నిందితులకు జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు.