Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక విధానంలో 1:50 కాకుండా 1:150కి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంపిక విధానం వల్ల అనేక మంది నిరుద్యోగులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శుక్రవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. తదుపరి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేవరకు చాలా మంది నిరుద్యోగులు వయసు రీత్యా దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కోల్పోతారని పేర్కొన్నారు. అందువల్ల మెయిన్స్ ఎంపిక 1:50 కాకుండా 1:150 చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష పేపర్‌ను ప్రాంతీయ భాషలో ఇవ్వాలని కోరారు.