Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యానవన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు వ్యాపార ఒరవడిని అలవర్చు కోవడం, అందులో మెలకువలు నేర్చు కోవడం ద్వారానే సాగు లాభసాటిగా ఉంటుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ అన్నారు. భారత దేశంలో ఉద్యాన రంగానికి అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. దేశ ఆర్థిక అభివద్ధిలో భవిష్యత్తులో ఉద్యాన రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. వనపర్తి జిల్లా మోజర్లలోని ఉద్యాన కళాశాలలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రభుత్వ డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉద్యాన రైతులు సంఘటితంగా ఉండి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను, అనుబంధ ఉత్పత్తులను ఒక పరిశ్రమగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి లాభాలు పొందుతున్నారని చెప్పారు. సేంద్రీయ కూరగాయలు, పండ్లు, వివిధ రకాల విత్తన ఉత్పత్తి, పంటకోత అనంతర ఉద్యాన పంటలు, హరిత గృహాల్లో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటల సాగు, తేనెటీగల పెంపకం, వర్మి కంపోస్ట్, భూసార పరీక్షలలో నైపుణ్యం సాధించాలని సూచించారు. నైపుణ్యంతో కూడిన ఉద్యాన విద్యను అందించడమే ధ్యేయంగా వర్సిటీలో పాఠ్యాంశాల బోధన జరుగుతున్నదని తెలిపారు. అర్బన్ కిసాన్ సీఈవో డాక్టర్ పి. సాయిరాంరెడ్డి, ఇంద్రప్రస్థ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సుహేల్ ఖాన్, ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వేణు మార్గం, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల ఆఫీసర్ కే. సురేష్, వర్సిటీ డీన్ డాక్టర్ అడప కిరణ్ కుమార్, నీటి పరీక్షలతోపాటు ఉద్యానరంగంలో స్టార్టప్, ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కల ఆధారిత వ్యాపారం, డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలపై అభ్యర్థులకు నిపుణులతో శిక్షణ ఇచ్చిన్నట్టు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పిడిగం సైదయ్య చెప్పారు.