Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పత్తి, కందులు, మొక్కజొన్న, మిరప, పసుపు పంటల సేకరించేందుకు అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. తద్వారా మార్క్‌ఫెడ్‌ను బలోపేతం చేయాలని కోరారు. శుక్రవారం మార్క్ ఫెడ్ 'నూతనవ్యాపార ప్రతిపాదనలపై' హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కందులను పప్పుగా మార్చి మార్కెటింగ్ చేసే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. ఆదిలాబాద్‌లోని మార్క్‌ఫెడ్ సొంత ప్రాసెసింగ్ యూనిట్లో పత్తి సేకరణ, పత్తి బేళ్ల మార్పిడికి అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. వేరుశెనగ ప్రాసెసింగ్ ప్లాంట్ల అధ్యయనం కోసం గుజరాత్‌కు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. కచ్చితమైన హామీ ప్రాతిపదికన వాణిజ్య సేకరణ ద్వారా అవసరమైన మొక్కజొన్న సరఫరా కోసం ఇతర రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘు నందన్‌రావు, మార్క్ ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, పాలకవర్గ సభ్యులు రంగారావు, విజరుకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.యాదిరెడ్డి, జనరల్ మేనేజర్ బి.విష్ణువర్ధన్‌రావు తదితరులు పాల్గొన్నారు.