Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎల్ఏ కమిషనర్‌కు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్‌లో దొర్లిన భూసంబంధిత తప్పులను సరిదిద్ది సక్రమ పాస్ పుస్తకాలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోరింది. ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పులను తొలగించే, రద్దు చేసే మాడ్యూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, రాష్ట్ర నాయకులు ప్రభులింగం, జంగయ్య తదితరుల బృందం ఇదే అంశంపై సీసీఎల్ఏ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత రైతుల భూహక్కులను కాపాడాలన్నారు. ఈ మాడ్యూల్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి అమలు చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పేర్కొంటుంది.