Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనాలను సవరించాలి
- పోస్టరావిష్కరణలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఆరోతేదీన హైదరాబాద్లోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద మహాధర్నా చేయనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యా లయంలో మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కనీస వేతనాల సలహా మండలి సభ్యులు భూపాల్, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, పి. శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఈశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సుధాకర్, యాటల సోమన్న తది తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ.. ఎని మిదున్నరేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం పనిచేస్తున్నదని విమర్శించారు. 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్లో కోటి మంది కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదన్నారు. 2014 తర్వాత కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఐదేండ్లకోసారి నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని చట్టాలు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకు రూ.150 వేతనం నిర్ణయించి కార్మికుల శ్రమను దోపిడీ చేయడానికి కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించిందని విమర్శించారు. 2021 జూన్లో ఐదు రంగాలకు కనీస వేతనాలు పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్స్ ఇచ్చారనీ, వాటిని గెజిట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు, రోజుకు ఏడుగంటలు, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టు వలస కార్మికులకు చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.