Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు అడ్డా కూలీలు మృతి
- గోడ మీద నుంచి జారిపడి ఒకరు..
- గుండెపోటుతో మరొకరు..
నవతెలంగాణ-నవీపేట్
నిజామాబాద్ జిల్లా జన్నేపల్లిలో గల మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గెస్ట్‌హౌస్‌లో ఇద్దరు అడ్డాకులీలు మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఎస్ఐ రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన కొండపల్లి రాజు(38) ఐదు సంవత్సరాలుగా నిజామాబాదులో అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం నిజామాబాద్ నుంచి మరో అడ్డ కూలీతో కలిసి గోడ కూల్చే పనికి జన్నేపల్లిలోని ఎమ్మెల్యే గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేశాక గోడ ఎక్కిన రాజు ప్రమాదవశాత్తు జారి కింద పడిపోగా తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న మరో కూలి అది చూసి గుండెపోటుతో మృతిచెందాడు. దాంతో కాంట్రాక్టర్ రహీం అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం. మృతుడు కొండపల్లి రాజుకు తల్లిదండ్రులున్నారు.