Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి(92) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మలక్‌పేటలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1930 డిసెంబర్ 31న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన ఆమె మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. విడదీసే రైలు బళ్లు, మెరుపు తీగె, అవతలి గట్టు, తొణికిన స్వర్గం, పెళ్లి, ప్రేమించు, ఆంధ్ర నాయకుడు వంటి ఎన్నో రచనలు చేశారు. 1954లొ ఆమెకు కవి ఆరుద్రతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.