Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మూడు పోటీ పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఖరారు చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఈనెల 15,16 తేదీల్లో, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ నాలుగో తేదీన, 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు ఏప్రిల్ 23న రాతపరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-1 పోస్టుల మెరిట్ జాబితా విడుదల
మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-1 పోస్టులకు సంబంధించి మెరిట్ జాబితాను విడుదల చేశామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామ చంద్రన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జనవరి ఎనిమిదిన రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువపత్రాల పరిశీలన చేపడతా మని వివ రించారు. మెరిట్ జాబితా కోసం https:// www. tspsc. gov.in వెబ్ సైట్ను సంప్రదించాలని కోరారు.