Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీలు, సీపీలకు డీజీపీ ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
శాంతి భద్రతలకు తరచుగా విఘాతాన్ని కలిగించే సున్నితమైన ప్రాంతాలపై ఎల్లపుడూ జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిసనర్లు దృష్టిని సారించాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు మొదలుకుని డీఎస్పీల వరకు వారి పని తీరును రాష్ట్ర డీజీపీ సమీక్షిం చారు. వారు అనుసరించాల్సిన విధానాలపై ఒక కార్యాచరణ పట్టికను రూపొందించి వారికి జారీ చేశారు. ప్రతి నెలా సున్నితమైన గ్రామాలు, బస్తీలు, పట్టణాలలో జిల్లాల ఎస్పీ లు, నగర సీపీలు పర్యటిస్తుండాలని, దానితో అక్కడి వాతావరణం, ప్రజల మనస్తత్వాన్ని స్వయంగా అంచనా వేయడానికి వీలవుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పటికీ ఉన్నతాధికారులు వెళ్లడంతో అక్కడి స్థానిక ప్రజల్లో భరోసాను నిం
పవచ్చనీ, భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగ కుండా చూడటానికి వీలవుతుం దన్నారు. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్రంలో 137 పోలీసు స్టేషన్లను, 48 సున్నితమైన గ్రామాలను ఎస్పీలు, సీపీలు పర్యటించి వచ్చారనీ, ఇది మంచి పరిణామమని అంజనీకుమార్ అన్నారు. ఇదే విధానాన్ని మున్ముందు కూడా కొనసాగిస్తూ రాష్ట్రంలో ఎప్పటికి శాంతియుత వాతావరణం చెడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై అవగాహన కలిగి ఉన్న ఉన్నతాధికా రులకు ఆయా ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తగిన నివారణ చర్యలు తీసుకోవడానికి వీలవు తుందని అన్నారు. ఇలాంటి సమీక్షలు ప్రతి నెలా నిర్వహిస్తామని తెలిపారు.