Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు : కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. భిన్న కులాలు, మతాలు, ఆచార వ్యవహారాలతో గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా హైదరాబాద్ జీవన విధానం పరిఢవిల్లుతుందనీ, దాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని చెప్పారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. కన్నడిగుల కోసం హైదరాబాద్ కాచిగూడలోని కర్ణాటక సాహిత్య మందిరం పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు.
దీనికి సీఎం కేసీఆర్ తక్షణం ఆమోదం తెలిపారు. దానికోసం రూ.ఐదు కోట్ల నిధులను కూడా విడుదల చేస్తామన్నారు. కన్నడిగుల సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వారి అవసరాల కోసం వినియోగించుకునేలా అన్ని మౌలిక వసతులు కల్పించి, ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ఆయన కాలేరు వెంకటేష్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.