Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 ఉపాధ్యాయ సంఘాల మద్ధతు
- తొమ్మిది జిల్లాల్లో భారీస్పందన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఈనెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయా సంఘాల అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో 137 పోలింగ్ స్టేషన్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అలాగే 29,720 మంది టీచర్లు ఓటును నమోదుచేసుకున్నారు. వీరందరిని ఇటు పాఠశాలల్లో, అటు వ్యక్తిగతంగానూ కలిసి ఓటును అభ్యర్థించేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలోకి దిగిన పాపన్నగారి మాణిక్‌రెడ్డి ప్రచారాన్ని తనదైన శైలీలో నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొనేందుకు గత రెండు నెలలుగా విస్తృతంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అలాగే ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం చురుగ్గా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ముందుకు పోతున్నారు. దాదాపు పది ఉపాధ్యాయ సంఘాలు మాణిక్‌రెడ్డికి ఇప్పటికే మద్ధతు ప్రకటించాయి. ఆయన తరపున స్వచ్చంధంగా ప్రచారం చేస్తున్నాయి. వ్యక్తిగత ప్రలోభాలకు లొంగరాదనీ, విద్యారంగాన్ని కాపాడుకుందామనీ, మన సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడం, చర్చించడం ద్వారా పరిష్కరించుకుందామని మాణిక్‌రెడ్డి అనేక పాఠశాలల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. అభ్యర్థితోపాటు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పి.జంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి , ఇతర రాష్ట్రస్థాయి ఆఫీసు బేరర్ల నేతృత్వంలో మొత్తం అన్ని జిల్లాల్లో మాణిక్‌రెడ్డి తరపున ప్రచారం జరుగుతున్నది. ఇకపోతే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి ఉపాధ్యాయులు వచ్చి ప్రచారం చేస్తుండటం గమనార్హం. నేడు విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, మతోన్మాద ప్రభావం, యూజీసీ నిర్వీర్యం, సిలబస్‌ను కలుషితం చేయడం, ఇతర ఉపాధ్యా యుల సమస్యలు తదితర అంశాలపై ఉపాధ్యాయుల్లో చైతన్యం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మంచి ప్రభావం కనిపిస్తున్నదనీ, టీచర్లు, లెక్చరర్లు, యూనివర్సిటీల అధ్యాపకులు ఆదరణ చూపిస్తున్నారని ఆ సంఘం నేతలు చెబుతున్నారు. సర్వీసులో చేరిననాటి నుంచి ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న నేతగా మాణిక్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ప్రత్యేక విద్యావాలంటీర్లను పర్మినెంట్ చేయించడంలో రాష్ట్రసంఘం తో కలిసి రాజీలేని ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర మాణిక్ రెడ్డిది. అందుకే ఉపాధ్యాయ ఉద్యమ చుక్కాని, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆశీస్సులు మాణిక్‌రెడ్డికి లభిం చాయి. అలాగే విద్యార్థులు, యువత, గ్రాడ్యుయేట్లు, ప్రజల సమస్యలపై శాసనమండలిలో గర్జించిన ప్రొఫెసర్ డాక్టర్ కె.నాగేశ్వర్ సైతం మాణిక్‌రెడ్డికి తన సంపూర్ణ మద్ధతును ప్రకటించడం విశేషం. అనారోగ్యంతో నామినేషన్ కార్యక్రమానికి చుక్కా రామయ్య రాలేకపోయినా, నాగేశ్వర్ మాత్రం దగ్గరుండి నిండు మనస్సుతో మాణిక్రెడ్డిచేత నామి నేషన్ వేయించారు. ఆయన తనదైనరీతిలో మాణిక్‌రెడ్డికి ప్రచారం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అయితే కాలికి బొంగురం కట్టుకుని అన్ని జిల్లాల్లో తిరుగుతుండటం అందరికి తెలిసిందే. ఈనేపథ్యంలో ఉపాధ్యాయుల్లో టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పట్ల సానుకూలత వ్యక్తమవు తున్నది. పోరాడే సంఘం అభ్యర్థిగా గుర్తింపు వస్తున్నది. గతంలో ఉన్న ఎమ్మెల్సీలు సర్కారులో కలిసిపోవ డం, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ప్రభు త్వంతోగానీ, సీఎంతోగాని చర్చించక నిర్లక్ష్యంగా ఉండటం, అలక్ష్యం వహించడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే శాసనమండలిలోనూ ప్రస్తావించిన పాపానపో లేదు. దీంతో ఆ సంఘం నుంచి ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థిపైనా పెదవివిరిచే పరిస్థితి ఏర్పడింది. అంతేగాక ఒకే సంఘం నుంచి తాజా ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఉపాధ్యా యలోకంలో విస్మయం వ్యక్తమవుతున్నది. ఈ తరుణంలో మాణిక్‌రెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూ బ్‌నగర్, మేడ్చల్, వికారాబాద్, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, నారాయణ్‌పేట్, వనపర్తి , నాగర్‌కర్నూల్ జిల్లాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు.
పది సంఘాల మద్ధతు
టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి ప్రత్యక్షంగా పది ఉపాధ్యాయ సంఘాలు మద్ధతు ప్రకటిం చాయి. పరోక్షంగా మరికొన్ని సంఘాలు సహకారాన్ని అంది స్తున్నాయి. ప్రచారంలో పాల్గొంటున్నాయి. కాంట్రాక్ట్ లెక్చ రర్స్ అసోసియేషన్, తెలంగాణ ఆల్ రెసిడెన్షియల్ ఎంపా ్లయిస్ అసోసియేషన్, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్, కేజీబీవీ ఎంప్లాయిస్ అసోసియేషన్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బీసీ వెల్ఫేర్ టీచర్స్ అసోసి యేషన్, ఐక్య గురుకులాల ఉపాధ్యాయ ఫెడరేషన్ తదితర సంఘాలు మాణిక్‌రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశాయి. విద్యారం గంతోపాటు ఉపాధ్యాయుల సమస్యలపై స్పష్టమైన అవగా హన ఉన్న మాణిక్‌రెడ్డిని శాసనమండలికి పంపాలని కోరుతున్నాయి.
మోడల్ బ్యాలెట్లో సీరియల్ నెం.17
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు ఆయా సంఘాల నుంచి పోటీచేస్తున్నారు. ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్‌ను సైతం ఖరారు చేసింది. ఆ మేరకు టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి సీరియల్ నెంబరు 17ను కేటాయించింది. ఇప్పటికే పలుమార్లు పాఠశాలలు, ఉపాధ్యాయులను కలిసిన టీఎస్‌యూటీఎఫ్ నేతలు, తాజా మోడల్ బ్యాలెట్‌తో తుది అంకంలోకి దిగారు. మోడల్ బ్యాలెట్‌ను పట్టుకుని ఉపాధ్యాయులను ఉమ్మడిగా, వ్యక్తిగతంగా కలిసే పనిలో ఉన్నారు.
గెలిపిస్తే మీ గొంతునవుతా: మాణిక్‌రెడ్డి
''విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. శాసనమండలిలో ప్రస్తావించిన వాళ్లు మౌనంగా వహిస్తున్నారు. అధికార పార్టీతో మిలాఖత్ అయి ఉపాధ్యాయులను దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే వ్యక్తి గత సమస్యలకుపోకుండా, స్వార్థాన్ని చూసుకోకుండా ఉపా ధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా శాసనమండలిలో మీ గొంతును వినిపిస్తా''నని నామినేషన్ కార్యక్రమంలో పది సంఘాలు బలపరిచిన టీఎస్‌యూ టీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.