Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో యూరోఫిన్స్ సంస్థ పెట్టుబడులు.. మంత్రి కేటీఆర్‌తో చర్చ తెలంగాణకు పెట్టుబడులు తరలివస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో యూరప్‌కు చెందిన యూరోఫిన్స్ సంస్థ ప్రతినిధులు శనివారం భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సంస్థ పెట్టుబడి ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశంలో బయోఫార్మా సర్వీసెస్ యూరప్ ప్రెసిడెంట్ నటాలియా శుమాన్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. కేటీఆర్ దావోస్ పర్యటనలో వెయ్యి కోట్ల పెట్టుబడిని యూరోఫిన్స్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.