Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త మరణం తట్టుకోలేక.. అపార్ట్మెంట్ పై నుంచి దూకి బలవన్మరణం
- పెద్దకూతురుని దత్తత తీసుకోవాలని సూసైడ్‌నోట్
నవతెలంగాణ-కంఠేశ్వర్
వారి సంసారం అన్యోన్యంగా సాగింది. అంతలో ఊహించని విధంగా భర్త గుండెపోటుతో మృతిచెందడంతో భార్య తట్టుకోలేకపోయింది. భర్త లేని తాను జీవించలేనని చిన్న బిడ్డతో కలిసి అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకింది. తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ లింబాద్రి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన జటాల అనూష (27)కు నాలుగేండ్ల కిందట శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరు ప్ర స్తుతం కరీంనగర్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు శ్రీకృత(1), శ్రీహిత ఉన్నారు. వీరి సంసార జీవితం అన్యోన్యంగా సాగుతున్న వేళ.. రెండు నెలల కిందట భర్త గుండెపోటుతో మృతిచెందాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. కొన్ని రోజుల కిందట నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్‌లోని సాయి ఆర్కేఆర్ అపా ఓర్ట్మెంట్లో ఉంటున్న వారి పెద్దమ్మ ఇంటికి ఇద్దరు కూతుర్లను తీసుకొని వచ్చి ఉంటుంది. పెద్దమ్మ, పెద్దనాన్న మార్కెట్‌కు వెళ్లగా.. చిన్న కూతురు శ్రీకృతను తీసుకొని అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటనలో అనూష అక్కడికక్కడే మృతిచెందగా.. చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప రిస్థితి విషమించి మృతిచెందింది. మృతురాలి అన్న పుత్తూరు రవితేజ ఫి ర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 'నా చావు కు ఎవరూ కారణం కాదు. చిట్టి శ్రీహితను దత్తత తీసుకొని చూసుకో' అని మృతురాలు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.