Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సిలిండర్ ధరలను తగ్గించాలంటూ మహిళా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించింది. బీజేపీ ఆఫీస్ వద్ద కూర్చొని మోడీ, కేసీఆర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు మహిళ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి నాంపల్లి పోలిస్ స్టేషన్ కు తరలించారు.