Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు వస్తున్న అదరణను చూసి బీఆర్ఎస్ నేతల్లో గుబులుపుట్టిందని టీపీసీసీ అద్దంకి దయాకర్ చెప్పారు. అందుకే రేవంత్ యాత్రపై అధికార పార్టీకి చెందిన నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. పూర్తి భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఇలా దాడులకు పూనుకోవడమేంటని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. హైకోర్టు చెప్పిన కూడా ప్రభుత్వం రేవంత్ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. శాంతిభద్రతల సమస్యలను చూపించి యాత్రను అడ్డుకునే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్‌కు సరైన భద్రత కల్పించాలని కోరారు.