Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రవేశాల దరఖాస్తుకు చివరి తేది 10
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కొత్తగా ప్రవేశపెట్టిన పీజీ డిప్లొమా కోర్సుల బ్రోచర్‌ను ఆ వర్సిటీ ఉపకులపతి కె సీతారామారావు శనివారం విడుదల చేశారు. కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన కోర్సుల్లో పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఆపరేషన్ మేనేజ్మెంట్ కోర్సులున్నాయని ఆ విభాగ డీన్ ఆనంద్పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఈనెల పది వరకు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి, ఈ సుధారాణి, షకీలా ఖాణం, వడ్డానం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.