Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక నిజామాబాద్కూ పరిశ్రమలు వస్తారు
- తుదిదశకు పనులు.. త్వరలో ప్రారంభం : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-కంఠేశ్వర్
పరిశ్రమల అభివృద్ధికి ఐటీ హబ్ ఒక ఆరంభం లాంటిదని, ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్‌కు రానున్నాయని, త్వరలో ఐటీ హబ్ ప్రారంభిస్తామని, దీనికోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఐటీ హబ్ పనులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తతో కలిసి శనివారం పరిశీలించారు. ఐటీ హబ్ వెబ్‌సైట్‌పై టీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్ గుప్త ఎమ్మెల్సీకి వివరించిన అనంతరం కవి త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.కవిత మాట్లాడు తూ.. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేయిస్తామని, ఇతర జిల్లాల ఐటీ హబ్‌లతో పోల్చు కుని లోటుపాట్లను సరిదిద్ది నిజామాబాద్ ఐటీి హబ్ ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. రూ.50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీ హబ్‌లో 750 మంది యువతకు అవకాశం ఉందని, ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయని చెప్పా రు. దేశ వ్యాప్తంగా ఐటీ ఎక్స్‌పోర్ట్‌లో రెండవ స్థానం లో ఉన్నామని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికతో నిర్మా ణాలు చేయించిన ఎమ్మెల్యే గణేశ్, ఎన్నారై కోఆరి ్డనేటర్ మహేశ్ బిగాలకు అభినందనలు తెలియ జేశారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.