Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్ ఘనపూర్
'విశ్వనాథపూర్లో ఇయ్యలే.. శివునిపల్లిలో జాగా లేదు.. నమిలిగొండలో జాగా ఉంది.. కాలేజీలు పడ్డాయి.. అక్కడ పాంనూర్‌లో వాల్లకిచ్చినం కట్టలే.. ఉప్పుగల్లులో అక్కడా కాలే.. రాఘవాపూర్‌లో ఇస్తే కాంట్రాక్టర్ ముందు పడ్డాడు.. చేసినం.. పక్కన కొత్తపల్లి, పల్లగుట్ట, కళ్లెం పూరైనరు... ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారు.. ఏదేమైనా ఈ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్ సక్సెస్ కాలేదు' అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు కడుదుల జ్యోతి నర్సిరెడ్డి, జక్కుల పర్శరాములు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లెప్రగతితో దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చివరికి డబుల్ ఇండ్లు సరిగ్గా కడుతలేరని సీఎం కేసీఆర్ గతేడాది మార్చిలో 75 గజాల స్థలం గలవారికి 5వేల ఇండ్ల నిర్మాణానికి అవకాశం ఇచ్చారని తెలిపారు.