Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఐదు లక్షల మంది హమాలీ కార్మికుల రక్షణకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని దశలవారీగా పోరాటం చేయనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ప్రకటించారు. శనివారం హైదరాబాద్లోని సీఐటీయూ సిటీ కార్యాలయంలో తెలంగాణ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) సమావేశం జరిగింది. ఆ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాములు అధ్యక్షత వహించిన సమా వేశంలో భూపాల్ మాట్లాడుతూ. హమాలీలకు పనిభద్రత, కనీసవేతనం, గుర్తింపు కార్డులు, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా, పెన్షన్ వంటి కనీస సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. అవి అమలైతే కార్మి కులకున్న 8 గంటల పని, కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులన్నీ హరించు కుపోతాయని చెప్పారు. సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే పనిలో మోడీ సర్కారు ఉందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ వంటి బడా పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మి వేస్తున్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదలపైన భారాలు మోపుతున్నారన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు హమాలీల కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఈ నెల 11 నుంచి 20 వరకు హమాలీలకు వెల్ఫేర్ బోర్డు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం సంతకాల సేకరణ, కరపత్రాల పంపిణీ ప్రచారం చేయా లని పిలుపునిచ్చారు. 20న మండల కేంద్రంలో ధర్నాలు చేసి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయాలన్నారు. 25న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాల న్నారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ ఐదో తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి హమాలీ లు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శు లు పి. సుధాకర్, వై. సోమన్న, యాదగిరి, వీరయ్య, రాపర్తి రాజు, ఉపాధ్యక్షు లు చెన్నయ్య, పుట్టా ఆంజ నేయులు, యు. శ్రీనివాస్, కోశాధికారి మామిడాల కనకయ్య పాల్గొన్నారు.