Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తక్షణమే వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు చెల్లించాలనీ, ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 'ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు తీసుకోవడం ఉద్యోగుల హక్కుగా ఉన్నప్ప టికీ...సక్రమంగా చెల్లించకుండా వారి హక్కులను కాలరాస్తున్నారు. 317 జీవో అమలు పేరుతో ఉద్యోగుల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలను కూడా ఇవ్వకుండా ఇబ్బం ది పెడుతున్నారు. స్వరాష్ట్రంలో సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పీఆర్సీ నివేదిక అమలులో జాప్యంవల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు 21 నెలలపాటు పెంచిన జీతాన్ని నష్టపోయారు. ఈ ఏడాది జూన్ 30 నాటితో మొదటి పీఆర్సీ గడువు కూడా ముగియబోతున్నది. జులై ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలి. ఇప్పటివరకూ కమిషన్ నియమించకపోవడం దారుణం. ఇది ఉద్యోగు లను, ఉపాధ్యాయులను దగా చేయడమే. వెంటనే ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాలి' అని లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ, ఫ్రీ యూరియా, ఇంటి కో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, గిరిజన బంధు, చేనేత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఖాళీ జాగా ఉన్న వాళ్లందరికీ రూ.3 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.